Site icon NTV Telugu

Beauty: మారుతి చేతుల మీదుగా ప్రారంభమైన ‘బ్యూటీ’

Maruthi New Movie

Maruthi New Movie

Maruthi Team’s Beauty Movie Launched Formally: డైరెక్టర్ మారుతి టీమ్ నుంచి గతంలో వచ్చిన బేబీ సూపర్ హిట్ గా నిలవగా ఇప్ప్పుడు అదే బాటలో మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి టీమ్ ప్రోడక్ట్ – వానరా సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరో హీరోయిన్లుగా బాల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఒక సినిమా మొదలైంది. ఎ.విజయ్ పాల్ రెడ్డి నిర్మాతగా ప్రకాష్ రౌతు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న సినిమాకి “బ్యూటీ” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగాయి.

Actress Injured: జిమ్‌లో జాగ్రత్త.. ప్రముఖ టీవీ నటికి తీవ్ర గాయం!

ఇక ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీరశంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొని టీంకి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న బ్యూటీ సినిమా మే రెండు నుండి హైదరాబాద్ పరిసర పాంతాల్లో షూటింగ్ జరుపుకోనుందని అంటున్నారు. బేబీ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గేనిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

Exit mobile version