NTV Telugu Site icon

Maruthi : నన్ను టార్చర్ పెట్టాడు.. కొరడాలతో కొడుతుంటాడు.. డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు

Maruthi Comments On Siva Sai Vardhan

Maruthi Comments On Siva Sai Vardhan

Maruthi Comments on Director Siva Sai Vardhan goes Viral: ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా ‘రాజా సాబ్’ చేస్తున్న దర్శకుడు మారుతీ, రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’కి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మారుతి ఈ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసి మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ తో మంచి ప్రాజెక్ట్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. దర్శకుడు సాయికి ఈ పాయింట్ చెబితే తను చాలా బాగా డిజైన్ చేసుకొని తీసుకొచ్చారు. ఇది కాన్సెప్ట్ ఫిల్మ్. ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించే ఫిల్మ్ అని భావిస్తున్నాను. ఇది మన మధ్యలో జరిగే ఒక కథలా వుంటుంది. మనిషా చాలా చక్కగా నటించింది. శివసాయి చాలా టార్చర్ కాండిడేట్, ఎందుకంటే నన్ను కూడా మామూలుగా టార్చర్ పెట్టాడు. ఏదైనా ఒకటి చెబితే ఇదేందుకు అదే ఎందుకు అని 360 డిగ్రీలలో కోరడాలతో కొడుతూ ఉంటాడు.

Bernard Hill : టైటానిక్ నటుడు మృతి

చాలా పాషన్ వున్న దర్శకుడు. ప్రతి విషయంలో చాలా క్లియర్ గా పర్ఫెక్ట్ గా వుంటాడు. అది చాలా బాగుంటుంది అలాగే పెయిన్ కూడా ఉంటుంది. అతనితో మాట్లాడి మాట్లాడి నా గొంతు కూడా ఒక నెల రోజులు పాటు పని చేయలేదు అంటూ మారుతి కామెంట్స్ చేశారు. శేఖర్ చంద్ర మంచి పాటలు ఇచ్చారు. ఇద్దరు డీవోపీలు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరూ వున్నారు. తమిళ్ నుంచి కూడా వీటి గణేషన్ లాంటి నటులు తీసుకొచ్చారు. మంచి కంటెంట్ తో రాబోతున్న ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమా అవ్వబోతుంది. రెండు రీళ్ళు చూశా, ఫ్లో చాలా బాగుంది. చిన్న సినిమాలు ఎప్పటికీ బావుండాలి. నేను ఎంత పెద్ద సినిమాలు చేస్తున్నా .. చిన్న సినిమాతోనే వచ్చాను కాబట్టి ఆ సినిమాలు వదలకుండా ట్రావెల్ అవుతున్నాను. ఈ సినిమా కూడా బాగా ఆడితే ఇంకా ఎనర్జీ వస్తుంది అని అన్నారు.