Site icon NTV Telugu

Akhilesh Kalaru: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సినిమా నిర్మాణం.. హిట్ కొడతానంటున్న నిర్మాత

Market Mahalaxmi Movie Producer

Market Mahalaxmi Movie Producer

Market Mahalakshmi Producer Akhilesh Kalaru Interview: బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటిస్తున్న ‘మార్కెట్ మహాలక్ష్మి’ ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. ముఖేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ ఉండగా, ఈ క్రమంలో ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. తాను ఇండియానాపోలిస్, USలో ఉంటున్నానని & ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఒకదానిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని అన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. సినిమా పరిశ్రమలో పనిచేయాలని అనుకున్నా, ఫ్యామిలీ కమిట్‌మెంట్‌ల కారణంగా, నేను మొదట ఆ బాధ్యతలను పూర్తి చేసి, ఆపై నా అభిరుచిని కొనసాగించాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

దర్శకుడు ముఖేష్ రెండేళ్లుగా తెలుసు, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో తెలుసు, “మార్కెట్ మహాలక్ష్మి” కథను ఆయన చెప్పినప్పుడు, నేను దానిని ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నా, రిస్క్ లేని వ్యాపారం లేదు. దర్శకుడు ముఖేష్‌ స్క్రిప్ట్‌ని నమ్మి ఆ రిస్క్‌ నేను తీసుకున్నా. “మార్కెట్ మహాలక్ష్మి” కథ చాలా సింపుల్ ఎందుకంటే ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ ఇది. మేము మా ప్రమోషన్‌లలో ఒక మెయిన్ పాయింట్ నీ చెప్పలేదు, అయితే ఆ పాయింట్ 19వ తేదీన ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందని ఆశిస్తున్నాం. సినిమాలో నటీనటులు తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. పార్వతీశం – ప్రణీకాన్విక ఇద్దరూ తమ పాత్రల్లో జీవించారు, వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద నటీనటులతో ఈ సినిమా చేస్తే బాగుండేదని నాకెప్పుడూ అనిపించలేదు. దర్శకుడు ముఖేష్‌ నాకు చెప్పిన కథనే తెరపైకి తెచ్చారు. ముఖేష్ కథ చెప్పినప్పుడు నేను వారి పాత్రలను విజువలైజ్ చేసుకున్నా, ఫైనల్ గా సినిమా చూసాక, నేను ఊహించిన వాటిని తెరపై చూసినట్టు అనిపించింది.

Exit mobile version