NTV Telugu Site icon

Pradeep Patwardhan: చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి

Pradeep

Pradeep

Pradeep Patwardhan: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మరాఠీ నటుడు ప్రదీప్ పట్వర్ధన్ గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పిన ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రదీప్ మరణ వార్త అటు మరాఠీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా మిగిలిన అన్ని ఇండుస్త్రీలలోను విషాదాన్ని నింపింది. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ను ప్రారంభించిన ప్రదీప్ చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ నటుడిగా ఎదిగారు. ఆయన నటించిన ‘ఎక్‌ ఫుల్‌ ఛార్‌ హాఫ్‌’, ‘డాన్స్‌ పార్టీ’, ‘మే శివాజీరాజీ భోంస్లే బోల్తె’, ‘ఛష్మే బహదూర్’ లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్న ప్రదీప్ బుల్లితెరపైన కూడా తనసత్తా చాటారు.

పలు సీరియల్స్ లో కనిపించి మెప్పించిన ప్రదీప్.. చివరిగా అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాంబే వెల్వెట్‌’ క్రైం థ్రిల్లర్‌ చిత్రంలో కనిపించారు. ప్రదీప్ వయస్సు 65. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే ఆయనకు ఇలా సడెన్ గా గుండెపోటు రావడం ఏంటని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ప్రదీప్ మృతిపట్ల మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండే తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు.” తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన ప్రదీప్ పట్వర్ధన్ ఇంకా లేరు అనే విషయం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. మరాఠీ చిత్ర పరిశ్రమ ఒక లెజండరీ నటుడును కోల్పోయింది” అంటూ ట్వీట్ చేశారు.

Show comments