Site icon NTV Telugu

VT 13: మిస్ వరల్డ్ తో రెడీ ఫర్ టేకాఫ్…

Vt 13

Vt 13

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ చేయకుండానే శక్తి ప్రతాప్ సింగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఇంకో సినిమాని మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ మూవీ ఒక షెడ్యూల్ షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇటివలే రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ‘మానుషీ చిల్లర్’ నటిస్తుందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘మిస్ వరల్డ్ 2017’గా గెలిచిన మానుషీ చిల్లర్ హిందీలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో పక్కన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించింది.

Read Also: Manchu Manoj: నేడు మౌనికారెడ్డితో మంచు మనోజ్ వివాహం…

డెబ్యు మూవీతో మంచి హిట్ కొట్టి కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలి అనుకున్న మానుషి చిల్లర్ ఆశలకి ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమా ఎండ్ కార్డ్ వేసింది. ఈ మూవీ తర్వాత మానుషి చిల్లర్ కి బాలీవుడ్ పెద్ద సినిమాల్లో నటించే అవకాశం రావట్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. అవి రిలీజ్ అయితే కానీ నార్త్ లో మానుషి చిల్లర్ కెరీర్ పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు సౌత్ వైపు అడుగులు వేస్తున్న ఈ బ్యూటీకి వరుణ్ తేజ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఎయిర్ ఫోర్స్ నేపధ్యంలో రూపొందుతున్న సినిమా కాబట్టి లాంగ్వేజ్ బారియర్స్ ఉండవు, అన్ని భాషల్లో సినిమా చెయ్యగలిగే స్కోప్ ఉంటుంది. సో సినిమా బాగుండి హిట్ కొడితే మానుషీ చిల్లర్ కి సౌత్ లో మంచి డెబ్యు దొరుకుతుంది.

Exit mobile version