Mansion 24 Trailer : రాజు గారి గది సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. హాట్ స్టార్స్ స్పెషల్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. తాజాగా మాన్షన్ 24 ట్రైలర్ లాంఛ్ అయింది. ఈ ట్రైలర్ రెండు నిముషాల నిడివితో ఇంట్రెస్ట్ రేకెత్తించింది. ముందుగా కాళిదాస్(సత్య రాజు) అనే వ్యక్తి మిస్ అవ్వడంతో అతని మీద దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. అతని కూతురు వరలక్ష్మీ తన తండ్రిని కనిపెట్టి దేశద్రోహి కాదని నిరూపించాలని ప్రయత్నిస్తుంది. అలా ఈ సిరీస్ ట్రైలర్ మొదలైంది. ఆయన మ్యాన్షన్ 24 అనే ఒక పాడుబడ్డ మ్యాన్షన్ లో మిస్ అయ్యాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి అతని కోసం వెతుకుతున్న క్రమంలో అతీంద్రియ శక్తులు, దుష్ట ఆత్మలు ఎదురవుతాయి.
Ram Charan: ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో దీక్షను పూర్తి చేసిన గ్లోబల్ స్టార్
రెండు నిముషాల ట్రైలర్ లో వణికించేలా కట్ చేశాడు ఓంకార్, ట్రైలర్ ఇలా ఉంటే ఇక సిరీస్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది అనడంలో సందేహం లేదని అంటున్నారు. ఈ సిరీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా వికాస్ బాడిస, ఆర్ట్ డైరెక్టర్ గా అశోక్ కుమార్, డీవోపీగా బి. రాజశేఖర్ గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడుగా ఓంకార్ వ్యవరిస్తూనే అశ్విన్ బాబు, కల్యాణ్ చక్రవర్తితో కలిసి నిర్మించారు. ఇక ఈ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, అవికా గోర్, బిందు మాధవి, అర్చనా జాయిస్, శ్రీమాన్, రావు రమేష్, అమరదీప్, నందు, అయ్యప్ప పి.శర్మ, మానస్, తులసి, జయప్రకాశ్, రాజీవ్ కనకాల, అభినయ, బాహుబలి ప్రభాకర్, విద్యుల్లేఖ రామన్, ఛత్రపతి శేఖర్, సూర్య, నళిని, శ్రద్ధా దాంగర్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఇక ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్నట్టు ప్రకటించారు.