Site icon NTV Telugu

Manoj : మా నాన్న నా కూతుర్ని ఎత్తుకోవాలి.. మనోజ్ కామెంట్స్ వైరల్..

Manoj

Manoj

Manoj : మంచు ఫ్యామిలీలో విభేదాలు మొన్నటి వరకు ఏ స్థాయిలో జరిగాయో మనం చూశాం. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో మంచు మనోజ్ చేస్తున్న కామెంట్లు తరచూ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే ఆయన తన కుటుంబం మళ్లీ కలిసిపోతే చూడాలని ఉందంటూ చెప్పాడు.

Read Also : Sandeep Reddy : ఆ డైరెక్టర్ల బాటలో సందీప్ రెడ్డి..?

తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాన్న నా కూతుర్ని ఎత్తుకుంటే చూడాలని ఉంది. మా అమ్మకు నా పాప అంటే చాలా ఇష్టం. కానీ ఈ గొడవల కారణంగా మా అమ్మను కూడా నన్ను కలవనీయట్లేదు. చాలా బాధగా అనిపిస్తోంది. అప్పుడప్పుడు ఏడుపొస్తోంది. ఈ గొడవల కారణంగానే మా అక్కను కూడా దూరం పెట్టాల్సి వచ్చింది.

కానీ మొన్న ఈవెంట్ లో వెళ్లి పలకరించాను. తను చాలా మంచిది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. నా జ్ఞాపకాలను ఎన్నిటినో ధ్వంసం చేశారు. నాపై నిందలు వేస్తూ సీసీ కెమెరాలు మాయం చేస్తున్నారు. ప్రతిసారి ఇదే జరుగుతోంది. కానీ నాకు కష్టంగా అనిపించి బయటకు వచ్చాను. నిందలు వేసి మోయాలంటే నా వల్ల కాదు. కానీ నాకు ఎవరిపై కోపం లేదు. వారందరినీ నేను ప్రేమిస్తూనే ఉంటాను. అందరం బాగుండాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు మనోజ్.

Read Also : PakIstan: భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..

Exit mobile version