Site icon NTV Telugu

Manchu Manoj: కాబోయే భార్యతో మరోసారి మీడియా కంటపడ్డ మనోజ్.. ఈసారి

Manoj

Manoj

Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మనోజ్.. దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక తో సహా జీవనం చేస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగనుంది. అయితే ఈ వివాహానికి మంచు కుటుంబం ఒప్పుకోకపోవడంతో మనోజ్ బయటికి వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆ మధ్య కాబోయే భార్యతో మంచు మనోజ్ వినాయక చవితి ఉత్సవాలను జరుపుకొంటూ మీడియా కంటపడ్డాడు.

ఇక చాలా రోజుల తరువాత మరోసారి మౌనికతో మంచు మనోజ్ మీడియా కంటపడ్డాడు. నేడు భూమా నాగిరెడ్డి జయంతి కావడంతో ఆయన సమాధి వద్దకు కాబోయే భార్య మౌనిక కలిసి వెళ్లి మామగారికి నివాళులు అర్పించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నేటి ఉదయం కడప లో ఉన్న దర్గాను దర్శించుకున్న మనోజ్.. ఫిబ్రవరిలో కొత్త సినిమాలు మొదలుపెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ పెళ్లి వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version