NTV Telugu Site icon

Manoj Manchu: ‘ఉస్తాద్’ మొదటి ఎపిసోడ్.. నాని గెలిస్తే డై హార్డ్ ఫ్యాన్ కి 50 లక్షల ప్రైజ్ మనీ

Manchu Manoj Birthday

Manchu Manoj Birthday

Manoj Manchu intresting tweet about Ustaad biggest game show: రాక్ స్టార్ మంచు మనోజ్‌ హోస్ట్‌గా ‘ఉస్తాద్‍’ ర్యాంప్‍ ఆడిద్దాం పేరిట సరికొత్త టాక్‌ షో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్‌ షో డిసెంబర్‌ 15 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో కొద్దీ రోజుల క్రితం ప్రోమో రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ షో గురించి మంచు మనోజ్ ఒక ట్వీట్ చేశారు. మంచు మనోజ్ ట్వీట్ ప్రకారం ఈ షో ఒక్కో ఎపిసోడ్ కి 50 లక్షలు ప్రైజ్ మనీ ఉంటుందట, మొదటి ఎపిసోడ్ కి నాని గెస్ట్ గా రాగా ఒక ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. అదేమంటే ఈ ఎపిసోడ్ లో గెలుచుకున్న అమౌంట్ నాని డై హార్ట్ ఫ్యాన్ కి ఆ అమౌంట్ వెళ్తుందట. ఇక ఆ మధ్య జరిగిన ప్రోమో రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్‌ మాట్లాడుతూ ఏడేళ్ళ గ్యాప్ తర్వాత ఏడు అడుగులేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇంతకు ముందు సినిమాలు చేయాలనే ప్యాషన్, గోల్ తో చేశానని, ఈ ఏడేళ్ళు మీరు చూపించిన భాద్యతగా మారిందని అన్నారు.

Anchor Suma: ఆమెకు ఉద్యోగం.. గుండెంతా ఆనందంతో నిండిపోయిందంటున్న యాంకర్ సుమ

ఇప్పుడు ప్యాషన్ కంటే భాద్యతతో వచ్చానని, గ్యాప్ తీసుకున్నందుకు ఫ్యాన్స్ నన్ను క్షమించాలని కోరుతున్నానని అన్నారు. ఈ సారి థౌజండ్ కాదు లక్ష కోట్లవాలా పటాకులు పేలబోతున్నాయని, అలాంటి టీం దొరికిందని అన్నారు. ఈటీవీ నుంచి రామోజీరావు, బాపినీడు, సాయి కృష్ణ, నితిన్, సాయి కిరణ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు. ఈ షో కాన్సప్ట్ నాకు చాలా నచ్చిందమొ. ఇదొక సెలబ్రిటీ గేమ్‌ షో. తమని ఎంతగానో అభిమానించే ఫ్యాన్‌ కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ఇదని అన్నారు. ఫ్యాన్ కోసం సెలబ్రేటీ ఆట ఆడి వాళ్ళకు డబ్బు ఇవ్వడం అనేది చాలా గొప్ప కాన్సప్ట్ అని ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం, అదే ఈ షో స్పెషాలిటీ అని అన్నారు. ప్రైజ్‌ మనీ వచ్చేసి.. రూ.50 లక్షలు, స్పెషల్‌ గిఫ్ట్‌లు కూడా ఉంటాయిని ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ షో మొదలుపెట్టామని అన్నారు.

Show comments