NTV Telugu Site icon

Venky Atluri: సినిమా మొత్తం ఒకటే షర్ట్, ప్యాంటు ధరించిన డైరెక్టర్

Untitled 1

Untitled 1

డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి నటుడు మాణిక్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా లక్కీ భాస్కర్ అనే సినిమా రూపొందింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ తో కలిసి fortune 4 సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సినిమా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రీమియర్స్ నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ మొదలైంది. ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో త్రివిక్రమ్ కి స్నేహితుడైన మాణిక్ రెడ్డి కనిపించాడు.

Venky Atluri: హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ లకు ఆడిషన్ ఇచ్చా.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్టార్ డైరెక్టర్

తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో మాణిక్ రెడ్డి మాట్లాడుతూ వెంకీ అట్లూరిని చూసి బాదేసేదని ఎప్పుడు చూసినా ఒకటే టీ షర్టు ఒకటే ప్యాంటు వేసుకుని కనిపించేవాడని అన్నారు. తన దగ్గర డబ్బులు ఉంటే ఆయనకు వేరే బట్టలు కొనిపెట్టాలని కూడా అనిపించిందని బయటపెట్టాడు. ఈ సందర్భంగా సాయికుమార్ పక్క నుంచి మాట్లాడుతూ అది సెంటిమెంట్ అని ఆయన చెప్పుకొచ్చారు. కరెక్టే అక్కడికే వస్తున్నాను అంటూ మాణిక్ రెడ్డి కవర్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద వెంకీ అట్లూరి ఒకటే షర్టు ఒకటే ప్యాంట్ ధరించాడు అనే వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ కూడా ఇప్పుడు ఒకే రకమైన టీషర్ట్ ఒకే రకమైన ప్యాంటు ధరిస్తారట. ఎందుకంటే బట్టలు ధరించేటప్పుడు వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు అని. బహుశా వెంకీ కూడా అలా ఏమైనా ట్రై చేసి ఉండొచ్చేమో.

Show comments