Site icon NTV Telugu

మణిశర్మ కుమారుడి ప్రేమ వివాహం!

గానం… సంగీతం… తోడయితేనే వీనులకు విందు. వీటిలో ఏది మరో దానితో జోడీ కట్టకపోయినా, ఏదో వెలితి ఉంటుంది. అలాంటి వెలితి అన్నది లేకుండా తమ సంసారనౌకను ఆనందసాగరంలో సాగించేందుకు పూనుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మహతీ స్వరసాగర్, గాయని సంజనా కల్మంజే. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతీ స్వరసాగర్. తండ్రి బాటలోనే పయనిస్తూ బాణీలు కడుతున్నాడు. ఎంచక్కా పదనిసలు పలికిస్తూ, సరిగమలతో సావాసం చేస్తూ ఇప్పటికే ఏడు సినిమాలకు స్వరకల్పన చేసేశాడు మహతీ స్వరసాగర్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందనున్న ‘భోళా శంకర్’కు మహతీ బాణీలు కూర్చనున్నాడు.
గాయని సంజనా కల్మంజే పలు తమిళ చిత్రాలలో పాటలు పాడి అలరించింది.

గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి – FUN88.com

థమన్ సంగీత దర్శకత్వంలో “షేర్, డిక్టేటర్” తెలుగు సినిమాలలోనూ సంజనా పాటలు పాడి ఆకట్టుకున్నారు. ఇక మహతీ స్వరసాగర్ స్వరకల్పనలో ‘భీష్మ’ చిత్రంలో “హేయ్…చూశా…” అనే పాటను ఆలపించింది సంజనా కల్మంజే. ఆ సమయంలోనే ఆ స్వరానికీ, ఈ బాణీకీ జోడీ కుదిరింది. వీరి ప్రేమ ఫలించి అక్టోబర్ 24న ఓ ఇంటివారు కాబోతున్నారు. చెన్నైలో మహతీ స్వరసాగర్, సంజనా కల్మంజే వివాహం జరగనుంది. అక్టోబర్ 28న హైదరాబాద్ లో రిషెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. మణిశర్మ బాణీలతో ఒకప్పుడు తెలుగు సూపర్ స్టార్స్ అందరూ సూపర్ డూపర్ హిట్స్ చూశారు. అందువల్ల చిత్రసీమలోని ప్రముఖు తారలందరూ మహతి, సంజనాను ఆశీర్వదించడానికి తరలివస్తారని చెప్పవచ్చు.

Exit mobile version