NTV Telugu Site icon

Mangalavaaram : మంగళవారం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!

Mangalavaaram Movie

Mangalavaaram Movie

Mangalavaaram to Stream on Disney Plus Hotstar from 26th December: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ మంగళవారం సినిమా ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 17 న రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకుంది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్ళై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ లో మిస్ అయిన వారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Bandi: సింగిల్ కారెక్టర్‌తో ‘బందీ’.. నగ్నంగా కనిపిస్తూ షాక్ ఇచ్చిన ఆదిత్య ఓం!

కొన్నిరోజుల నుంచి ఈ చిత్రం ఓటిటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని, ఆహా కొన్నది అని ప్రచారం జరగ్గా మంగళవారం డిజిటల్ హక్కులను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుని అధికారికంగా ప్రకటించింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మంగళవారం సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని కూడా ప్రకటించింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 26 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీ రికార్డ్స్ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. థియేటర్ లో హల్చల్ చేసిన ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి మరి.