నటుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన విషయం తెలిసిందే.. ఇటీవలే విష్ణు తన ప్యానల్ ప్రకటించారు. తాజాగా ఆయన ఎన్‌టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటు తనకే వేస్తారని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు.
‘నా అజెండా, మ్యానిఫెస్టో చూశాక పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా నాకు ఓటు వేసే ఛాన్సెస్ వున్నాయి మంచు విష్ణు తెలిపారు. ఇప్పటివరకూ మా నాన్న 800 మంది ఆర్టిస్ట్‌లకు ఫోన్ చేసి, మీ సహకారం కావాలి అని కోరగా వాళ్లందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ప్రకాశ్‌రాజ్ కంటే కూడా నేను బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలను. అందుకే పోటీలోకి దిగాను. ‘మా’ కు శాశ్వత భవనం లేకపోవడం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అధ్యక్షుడిగా ఎన్నికైతే ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని నేనే భరిస్తాను. అప్పు తీసుకువచ్చి దాన్ని నిర్మిస్తాను’ అంటూ విష్ణు తెలిపారు. మరి ఆ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
