Manchu Vishnu: ‘మా’ మంచు విష్ణు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu:ఏడాది క్రితం జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లో తనదైన బాణీ పలికించారు మంచు విష్ణు. ‘మా’ అధ్యక్షునిగా ఘనవిజయం సాధించిన మంచు విష్ణు ఇటీవలే సంవత్సర కాలంలో ఏ యే పనులు చేశారో వివరించారు. ఈ మధ్యే ‘జిన్నా’ సినిమాతో జనాన్ని పలకరించారు విష్ణు. హీరోగా అనేక చిత్రాలలో నటించినా, విష్ణుకు విజయమాధుర్యాన్ని చవిచూపిన చిత్రాలు కొన్నే అని చెప్పవచ్చు. తండ్రి మోహన్ బాబు లాగే మంచు విష్ణు కూడా విద్యావేత్త అనిపించుకున్నారు. ‘స్ప్రింగ్ బోర్డ్ అకాడెమీ’, ‘స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్స్’కు ఛైర్మన్ గా ఉన్నారు విష్ణు. తన విద్యాసంస్థలతో ఎంతో బిజీగా ఉన్నా, విష్ణు తన సినిమా కుటుంబ సభ్యులకు సేవ చేయాలన్న అభిలాషతో ‘మా’కు అధ్యక్షుడయ్యారు. మరోవైపు హీరోగానూ అలరించే ప్రయత్నం సాగిస్తున్నారు.
మంచు విష్ణు 1981 నవంబర్ 23న జన్మించారు. తండ్రి మోహన్ బాబు విలక్షణ నటునిగా సాగడం చిన్నప్పటి నుంచీ చూస్తూ వస్తున్నారు విష్ణు. మద్రాసులోని పద్మాశేషాద్రి బాలభవన్ స్కూల్ లో చదివారు. తరువాత తన తండ్రి నిర్వహిస్తోన్న ‘శ్రీవిద్యానికేతన్’లోనే కంప్యూటర్ సైన్సెస్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నిజానికి తండ్రి మోహన్ బాబుకు , విష్ణును పోలీసాఫీసర్ గా చూడాలన్న అభిలాష ఉండేది. తన తండ్రి నటించిన ‘రగిలే గుండెలు’లో బాలనటునిగా కనిపించారు విష్ణు. అప్పటి నుంచీ విష్ణు మనసులో నటనాభిలాష తిష్ట వేసుకుంది. అయితే, ఇంజనీరింగ్ పూర్తి కాగానే అసలు విషయం చెప్పారు విష్ణు. తండ్రి కూడా కాదనలేదు. అలా తన పేరు ‘విష్ణు’ టైటిల్ తోనే రూపొందిన చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు . ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. తరువాత వచ్చిన మూడు చిత్రాలు సైతం ఏమంత సంతృప్తి కలిగించలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’తో విష్ణుకు మంచి విజయం లభించింది. “దేనికైనా రెడీ, దూసుకెళ్తా” చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు విష్ణు. తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్ తో కలసి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో భలేగా వినోదం పండించారు విష్ణు. ‘రౌడీ’లో తండ్రి మోహన్ బాబుతోనూ, తన తండ్రి గురువుగారయిన దాసరి నారాయణరావుతో ‘ఎర్రబస్సు’లోనూ నటించారు విష్ణు. “ఈడో రకం -ఆడో రకం, లక్కున్నోడు, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్, మోసగాళ్ళు” వంటి చిత్రాలతో జనాన్ని పలకరించారు. తండ్రి మోహన్ బాబుతో ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రాన్ని నిర్మించారు విష్ణు. అదీ అంతగా అలరించలేదు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘జిన్నా’ ఈ మధ్యే విడుదలయింది. ఓ వైపు సినిమా, మరో వైపు విద్యాసంస్థలు, ఇంకో వైపు ‘మా’ అధ్యక్ష పదవి – ఇలా బహుముఖంగా సాగుతున్న విష్ణు మునుముందు ఏ సినిమాతో జనాన్ని పలకరిస్తారో చూడాలి.
Also Read
- Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
- Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
- The Paradise: తెలంగాణ ఫేవరెట్ 'సర్వపిండి'.. 'ది ప్యారడైజ్' ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
- RC17 : అక్టోబర్ 20న సుకుమార్ - రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!