NTV Telugu Site icon

Kannappa: సినిమా ఏమో కానీ స్టార్లతో చంపేస్తున్న మంచు విష్ణు

Kannappa Sarath Kumar

Kannappa Sarath Kumar

Manchu Mohan Babu and sarath Kumar added to Kannappa Star Cast: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ రావడం హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్ప మీద ఇప్పటికే జాతీయ స్థాయిలో అంచనాలున్నాయి. ఎందుకంటే ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్ప ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ మూవీ స్థాయి జాతీయ స్థాయికి పెరిగింది. ఇప్పుడు ఈ భారీ తారాగణంలోకి విలక్షణ నటుడు శరత్ కుమార్, కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు కూడా వచ్చి చేరారు. దక్షిణాదిలో శరత్ కుమార్‌కు హీరోగా, నటుడిగా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే, హీరోగా, ప్రముఖ పాత్రల్లో ఎంతో విలక్షణంగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న శరత్ కుమార్ ఇప్పుడు కన్నప్ప చిత్రంలో నటించేందుకు సిద్దమయ్యారు. కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ వస్తున్న శరత్ కుమార్ ఈ సారి అందరినీ ఆశ్చర్యపర్చబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు.

Bigg Boss Telugu 7: అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు.. ఏడిపించేసిన యావర్ బ్రదర్స్

బన్నీ, భరత్ అనే నేను, జయ జానకీ నాయకా, భగవంత్ కేసరి వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారన్న సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న మోహన్ బాబు తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు, ఈ ఇద్దరు కన్నప్ప సెట్స్ మీదకు రావడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అతని భక్తిని, ఆయన భక్తికి ఉన్న శక్తిని ఇప్పటికీ అందరూ తలుచుకుంటారు. శ్రీకాళహస్తిలోని గుడిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహాభారతం సీరియల్ తీసిన ముకేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇదొక మైలురాయిగా నిలిచేట్టు రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో స్టార్లను మోహరించడం చూస్తుంటే సినిమా ఏమో కానీ స్టార్లతో మంచు విష్ణు చంపేస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుంది అనేది.

Show comments