NTV Telugu Site icon

Manchu Manoj: నేను చేసిందేం లేదు.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడంతే

Manoj

Manoj

Manchu Manoj: ఎట్టకేలకు మంచు మనోజ్ తన ప్రేమను నిలబెట్టుకున్నాడు. ప్రేమించిన మౌనికను ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఇక మంచు మనోజ్ కే కాదు భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహమే. 12 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న వీరు.. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మౌనిక మొదటి పెళ్ళికి కూడా మనోజ్ గెస్ట్ గా వెళ్ళాడు. మౌనికకు ఒక బాబు కూడా ఉన్నాడు. అతడిని కూడా మనోజ్ అంగీకరించాడు. వారిద్దరి బాధ్యత తాను తీసుకుంటున్నట్లు మనోజ్ చెప్పుకొచ్చాడు. ఇక నేడు ఈ నూతన జంట తిరుపతి వెళ్లి స్వామివారి ఆశీర్వాదం అందుకున్నారు. ఇక దర్శన అనంతరం మనోజ్ తన ప్రేమ పెళ్లి గురించి, ఆ బాబుతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.

Allu Sneha Reddy: అల్లు అర్జున్ చనిపోయినా పర్లేదు అని చెప్పిన ధైర్యం ఆమెది

“ఎప్పటికైనా ప్రేమనే గెలుస్తోంది. ఇప్పుడు నా ప్రేమ కూడా గెలిచింది. అందరి ఆశీర్వాదాలు మాకు అందాయి. ఇక నేను పోస్ట్ చేసిన శివుని ఆజ్ఞ గురించి చెప్పాలంటే.. ఆ శివుడే వీరిద్దరిని నాకు అప్పగించాడు. నేను చేసిందేమి లేదు.. అంతా శివుడి ఆజ్ఞ.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడంతే.. వారిని బాగా చూసుకోవాలి. నేను, మౌనిక ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నాం. ఇక నేను ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాను. త్వరలోనే వాట్ ది ఫిష్ సినిమాపూర్తి కావొస్తోంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments