Site icon NTV Telugu

Manchu Manoj: మనోజ్-మౌనికల పెళ్లి పాటలో మంచు విష్ణు…

Manchu Manoj

Manchu Manoj

మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చ్ 3న మనోజ్, మౌనికలు ఫిల్మ్ నగర్ లోని ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి మంచు మనోజ్ రిలీజ్ చేశాడు. “THEY SAY THIS KIND OF LOVE IS ONCE IN A LIFETIME, AND I KNOW YOU ARE THE ONE FOR ME. I OFFER YOU ALL OF ME TODAY AND FOR ALWAYS. THANK YOU FOR SHOWING ME HOW IT FEELS TO BE LOVED” @BhumaMounika ” అని మౌనికా రెడ్డికి ట్యాగ్ చేసి మంచు మనోజ్ వెడ్డింగ్ సాంగ్ ని రిలీజ్ చేశాడు. ఇందులో మంచు మనోజ్, మౌనికా రెడ్డికి ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి పెళ్లి చేసుకునే వరకూ ప్రతి సెలబ్రేషన్ ని రికార్డ్ చేశారు. శివుడు ఆజ్ఞ అంటూ “ఏం మనసో” అనే హుక్ లైన్ తో ఈ సాంగ్ సాగింది.

మ్యూజిక్ డైరెక్టర్, మంచు మనోజ్ ఫ్రెండ్ “అచ్చు” ఈ సాంగ్ ని కంపోజ్ చేసి పాడగా, అనంత శ్రీరామ్ లిరిక్స్ రాసాడు. ఈ ఇద్దరికీ మంచు మనోజ్ థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. మౌనిక, మనోజ్ ల వెడ్డింగ్ సాంగ్ లో మంచు విష్ణు కూడా కనిపించడం విశేషం. మంచు విష్ణు, మనోజ్ పెళ్లి సమయంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు అనే కామెంట్స్ వినిపించాయి కానీ ఈ సాంగ్ లో మంచు విష్ణు ఒకటికి రెండు సార్లు కనిపించాడు. మంచు ఫ్యామిలీ అంతా కలిసి చాలా హ్యాపీగా మంచు మనోజ్ మ్యారేజ్ చేశారనే విషయం అర్ధమవుతోంది. ఈ సాంగ్ లో సాయి ధరమ్ తేజ్, నవదీప్, వెన్నెల కిషోర్, శివ బాలాజీ మరి కొంతమంది సెలబ్రిటీలు కనిపించారు. 

Exit mobile version