రాకింగ్ స్టార్ మనోజ్ మంచు సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ఫుల్ కథలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవల భైరవం సినిమాతో మెప్పించాడు మనోజ్. మరోవైపు పీపుల్స్ మీడియా నిర్మించే మిరాయ్ సినిమాలో మరొక డిఫ్రెంట్ రోల్ చేస్తున్నాడు. ఇక ఇప్పడు మరో సినిమాను ప్రకటించాడు మనోజ్. డెబ్యూ దర్శకుడు హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్ మరియు నల్లగంగుళ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ పీరియాడిక్ ఇతిహాసం తెలుగు సినిమాలో ఒక మైలురాయి చిత్రంగా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యాక్తం చేస్తున్నారు.
Also Read : TheRajaSaab : వామ్మో రాజాసాబ్ రన్ టైమ్.. సీక్వెల్ కూడా ఉందా?
డేవిడ్ రెడ్డి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1897 – 1922 మధ్య జరిగే యాక్షన్ డ్రామా గా రాబోతున్న ఈ సినిమాలో మనోజ్ మంచు ఒక శక్తివంతమైన, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతారంలో కనిపించబోతున్నాడు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళే నిర్భయ తిరుగుబాటుదారుడి భావోద్వేగాలతో కూడుకున్న కథ, కథేనాలతో రాబోతుందట డేవిడ్ రెడ్డి. 21 సంవత్సరాల క్రితం, ఇదే రోజున, మంచు మనోజ్ దొంగ దొంగడితో తన అరంగేట్రం చేసాడు. ఇప్పుడు, సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత అదే రోజు తన తదుపరి బ్లాస్టింగ్ వెంచర్ ‘డేవిడ్ రెడ్డి’ని ప్రకటించాడు మనోజ్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. టైటిల్‌ను మనోజ్ ముఖంలో చూపిస్తూ సినిమా టోన్ ఎలా ఉండబోతుంది అనేలా డిజైన్ చేసారు. “మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు, ఢిల్లీలో పెరిగాడు. ఇప్పుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు” అనే ట్యాగ్‌లైన్‌తో తో రాబోతున్న డేవిడ్ రెడ్డి మనోజ్ కెరీర్ లో మరొక డిఫ్రెంట్ సినిమా కాబోతుందని చెప్పొచ్చు.