Site icon NTV Telugu

Manchu Manoj : నా పాత్ర మోడ్రన్ రావణుడి వెర్షన్ లాంటిది..!

Mirai Manoj

Mirai Manoj

తాజాగా ‘భైరవం’తో ప్రేక్షకులను పలకరించిన మంచు మనోజ్, ఇప్పుడు ‘మిరాయ్’తో మరోసారి బాక్సాఫీస్ బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్‌-ఇండియా సినిమా సెప్టెంబర్ 12న తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.ఏదైనా విపత్తు వస్తే దాన్ని ఆపడానికి మన ఇతిహాసాలలో ఒక సమాధానం ఉంటుంది. తన ధర్మాన్ని తెలుసుకుని విపత్తును ఎలా నిరోధించాడు.. అన్న పలు ఆసక్తి కరమైన అంశాలతో కూడిన మిరాయి చిత్రాన్ని చైనా, జపాన్‌ దేశాల్లోనూ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డేట్ ఆకట్టుకోగా.. మూవీపై ప్రేక్షకులొ అంచనాలు కూడా భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ విలేకరులతో మాట్లాడుతూ..

Also Read : Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజ్!

“మిరాయ్ కథలో హీరో, విలన్ అనే విభజన లేదు. రెండు గొప్ప శక్తులు తల పడితే ఏమవుతుందన్నదే కథనం. ఇందులో నా పాత్ర ‘బ్లాక్ స్క్వార్డ్’. ఇది ఒక మోడ్రన్ రావణుడి వెర్షన్ లాంటిది. కానీ ఆడవాళ్ల జోలికి వెళ్లని, తనకంటూ తత్వం ఉన్న పాత్ర. సీత రావణుడి జీవితంలోకి రాక ముందు అతను ఎలా ఉండేవాడో, అలాంటి స్టైల్ ఈ పాత్రలో ఉంటుంది. ఈ పాత్రకు ఓటమి అంటే ఇష్టం ఉండదు. శక్తి ఉన్నవాడికే స్థానం దక్కాలి అన్నది అతని నమ్మకం. కష్టపడని వాడికి ఈ ప్రపంచంలో చోటు ఉండకూడదు అనే స్ట్రాంగ్ పాయింట్‌తో సాగుతుంది. ఇలాంటి పాత్ర చేయడానికి ముందు దేవుడికి దండం పెట్టి, హనుమంతుడికి సారీ చెప్పి రంగంలోకి దిగాను” అని నవ్వుతూ చెప్పారు.

Exit mobile version