NTV Telugu Site icon

Manchu Manoj: ఆమె నా ప్రాణానికి ప్రాణం.. ఎమోషనల్ అయిన మనోజ్

Manoj

Manoj

Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు కుటుంబంలో ట్రోల్ చేయబడని హీరో అంటే మనోజ్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం మనోజ్.. మంచు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం మనోజ్ రెండో పెళ్లి అని, భూమా మౌనికతో మనోజ్ సహజీవనంలో ఉండడం ఇష్టం లేని మోహన్ బాబు, మనోజ్ తో మాట్లాడడం లేదని, అందుకే మనోజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక గత కొన్నిరోజుల నుంచి మనోజ్ కుటుంబంతో కలవడానికి తిరిగి ప్రయత్నిస్తున్నా మంచు కుటుంబం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇకపోతే నేడు మంచు మనోజ్ తల్లి నిర్మలా దేవి పుట్టినరోజు.. దీంతో తల్లిని తలుచుకొని మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా తల్లికి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. చిన్నతనంలో తన తల్లి తనకు అన్నం ముద్దలు తినిపించే అరుదైన ఫోటోను షేర్ చేస్తూ.. “నా ప్రాణానికి ప్రాణం అయిన మా అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మా.. నీకు అన్ని బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది నువ్వు ఏది కోరుకుంటే అది జరగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అమ్మ” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments