తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది మిరాయ్. టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్‌లతో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తేజా సజ్జా హీరోగా, రితిక నాయక్ హీరోయిన్‌గా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి వసులు రాబడుతుంది. ముఖ్యంగా ఇందులో
Also Read : Homebound : ఆస్కార్ రేసులోకి జాన్వీ సినిమా.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీ
ప్రతినాయకుడిగా మంచు మనోజ్ నటించిన ఈ చిత్రం సక్సెస్ వెనుక.. అతని విలన్ రోల్ ప్రధాన కారణంగా నిలిచింది. హీరోగా సత్తా చాటిన మనోజ్, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోకి మారడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు అభిమానులు అతను తదుపరి ప్రాజెక్ట్‌లో ఎప్పుడు నటిస్తాడో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మనోజ్ ఒక ఇంటర్వ్యూలో ఈ నిర్ణయం వెనుక పవన్ కల్యాణ్ సలహా ఉందట.. “నేను పవన్ గారిని చాలాసార్లు కలిసాను. ఆ సందర్భాల్లో ఆయన నాతో ఇలా చెప్పారు – నువ్వు నెగటివ్ రోల్ చేయడం చూడాలని ఉంది, విలన్ గా మారితే అది మాములుగా ఉండదు. బిజీ అవుతావు, కానీ ప్రయత్నించవలసినది” అని మనోజ్ పేర్కొన్నారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మనోజ్ మధ్య దీర్ఘకాలం మంచి అనుబంధం ఉంది. గతంలో, వారి అనుబంధానికి సంబంధించిన వీడియోలు ఎలక్షన్స్ సమయంలో వైరల్ అయ్యాయి
