Site icon NTV Telugu

Manchu Manoj: మంచు మనోజ్ భార్యను ఇలాంటి పోజ్ లో ఎప్పుడైనా చూశారా..?

Mounika

Mounika

Manchu Manoj: మంచు మనోజ్ ఈ మధ్యనే భూమా మౌనికను ప్రేమించి పెళ్లాడిన విషయం తెల్సిందే. తమ లవ్ స్టోరీ సినిమా కథకు ఏ మాత్రం తక్కువ కాదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక వీరి ప్రేమ పెళ్లితో సుఖాంతం కావడంతో అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా మంచు మనోజ్.. తన భార్య మౌనిక రేర్ ఫోటోను ఒకటి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నిన్న యోగా డే అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా మౌనిక యోగా చేస్తున్న ఫోటోను మనోజ్ షేర్ చేస్తూ.. అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఈ ఫొటోలో మౌనిక అత్యంత కష్టతరమైన ఏకపాద రాజకపోతాసనం వేస్తూ కనిపించింది. ఇది వెయ్యడం చాలా కష్టం. చాలా ఏళ్లు యోగాసనం చేస్తున్నవారు మాత్రమే వేయగలరు. దాన్ని మౌనిక చాలా ఈజీగా వేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Niharika Konidela: ఆరెంజ్ కలర్ టాప్‌లో నిహారిక కొణిదెల హాట్ ట్రీట్.. చూశారా?

ఇక అంతేకాకుండా.. మౌనిక నిత్యం 108 సూర్య నమస్కారాలు చేస్తుందట. ఈ యోగాను మౌనిక తన తల్లి శోభానాగిరెడ్డి వద్ద నుంచి నేర్చుకున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తన భార్య ఇలాంటి రేర్ యోగసనం వేయడంతో మనోజ్ సైతం గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు. ఇకపోతే మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం మనోజ్ వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మనోజ్ రీ ఎంట్రీ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Exit mobile version