NTV Telugu Site icon

Manchu Manoj: మంచు మనోజ్ పోస్ట్.. మంచోడు అంటూ నెటిజన్స్ ఫిదా

Manoj

Manoj

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనిక రెడ్డిలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్‌.ఈ పెళ్లి వేడుకలో మంచు ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. మోహన్‌ బాబు, లక్షి ప్రసన్న, విష్ణు, ఆయన భార్య విరానిక ఇతర కుటుంబ సభ్యులంతా మనోజ్‌తో ఉండి దగ్గరుండి ఈపెళ్లిని జరిపించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ , టి జి వెంకటేష్, కోదండరామిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గర్లని, దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు.

Read Also: Health : రోజులో నీరు ఎంత మోతాదులో, ఎప్పుడు తీసుకోవాలంటే..

ఇదిలా ఉంటే మంచు మనోజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పోస్ట్ ఎమోషనల్ గా ఉంది. తాను, తన భార్య భూమా మౌనిక రెడ్డి చేతులు కలిపిన ఫోటోను షేర్ చేశారు మనోజ్. అంతేకాదు ఆ ఫోటోకి క్యాప్షన్ గా శివుని ఆజ్ఞ అని పెట్టాడు. అందులో మౌనిక రెడ్డి కుమారుడి చేయి కూడా ఉంది. కాగా, మౌనిక రెడ్డికి 2018లో ధైరవ్ రెడ్డి అనే కుమారుడు జన్మించాడు. వివిధ కారణాల వల్ల భర్తకు విడాకులు ఇచ్చారు మౌనిక. మంచు మనోజ్ కూడా భార్యతో విడాకులు పొందారు. కొడుకు ఉన్న మహిళలను మళ్ళీ పెళ్ళి చేసుకోవడంతో మనోజ్ ది గొప్ప మనసు… మనోజ్ మంచోడు అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments