Site icon NTV Telugu

‘మంచి రోజులు వచ్చాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ కూడా రిలీజ్ అయింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ ఇందులో నటిస్తున్నాడు. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత యస్.కె.ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సోసో గా ఉన్న’ సాంగ్ ప్రోమో విడుదలైంది. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడారు. కేకే రాసిన ఈ పాట పూర్తి లిరికల్ వీడియో ఆగస్ట్ 16న విడుదల కానుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version