మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా తెలంగాణ టికెట్ ధరల పెంపు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 11 నుంచి 18 వరకు పెంచిన ధరల (సింగిల్ స్క్రీన్లకు రూ. 50/-, మల్టీప్లెక్స్లకు రూ. 100/- జీఎస్టీతో కలిపి) ప్రకారం విక్రయించిన టికెట్ల లెక్కలు సమర్పించాలని జీఎస్టీ అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంపు అక్రమమని, అందువల్ల ఈ సినిమా అక్రమ సంపాదించిన రూ.45 కోట్లను రికవరీ చేయాలని డాక్టర్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది.
Also Read :T20 World Cup: బంగ్లాదేశ్ దింపుడుకళ్లెం ఆశ.. ఐసీసీ ముందుకు చివరి డిమాండ్..
చట్టవిరుద్ధంగా ఈ సినిమా టికెట్ ధరలు పెంచారని, ఈ సినిమా ఆర్జించిన రూ.42 కోట్లను ప్రతివాదులు సంయుక్తంగా లేదా వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వ నిధికి లేదా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ మీద ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. అలాగే గతంలో దాఖలైన ‘పుష్ప- 2’, ‘గేమ్ ఛేంజర్’, ‘అఖండ-2’, ‘రాజాసాబ్’ వంటి సినిమాల టికెట్ ధరలపై దాఖలైన పిటిషన్లతో కలిపి రాబోయే వాయిదాలో విచారిస్తామని పేర్కొంది.
