Site icon NTV Telugu

Anasuya: అనసూయ మామూలుది కాదు.. అనుకున్నది సాధించిందిగా

Anasuya

Anasuya

Anasuya: హాట్ యాంకర్ అనసూయ అనుకున్నది సాధించింది. ఎవరైనా నా జోలికి వస్తే వారి అంతు చూస్తా అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిన అమ్మడు అన్నంత పని చేసింది. తన ఫొటోలతో పాటు హీరోయిన్ల ఫోటోలను ఫేక్ అకౌంట్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఆకతాయిలపై అనసూయ సీరియస్ అయ్యింది. సైబర్ క్రైమ్ పోలీసులకు వారిపై ఫిర్యాక్డు చేసింది. అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్ పెడుతున్నవారిని పట్టుకోవాలని ఆమె పోలీసులను సైతం డిమాండ్ చేసింది. ఇక అనసూయ ఫిర్యాదు అందుకున్న పోలీసులు..ఫేస్ బుక్ ,ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్ లో టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్న నిందితుడు పందిరి రామ వెంకట వీర్రాజును అరెస్ట్ చేశారు.

354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 నిందితుడు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు. సాయి రవి అనే ఫేక్ అకౌంట్ తో హీరోయిన్స్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఆసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన వాడని,గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబర్ వర్క్ చేసి ఇండియాకు వచ్చి హీరోయిన్ల ఫోటోలను పోస్ట్ చేస్తూ డబ్బు గుంజుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనసూయ ఫిర్యాదు తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే విచారణ చేపట్టి అతడిని పట్టుకున్నట్లు తెలిపారు. అతడి ల్యాప్ టాప్ లో యాక్ట్రెస్ రోజా, అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఏది ఏమైనా అనసూయ అనుకున్నది సాధించింది. ఇక నుంచి అనసూయతో జాగ్రత్తగా ఉండాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version