NTV Telugu Site icon

Guess the Actress: ఈ ఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది!

Mamitha Baiju

Mamitha Baiju

సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలు, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంటాయి. అదే విధంగా ప్రస్తుతం సౌత్ ఇండియాలో సంచలన నటిగా దూసుకుపోతున్న ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. మేం షేర్ చేసిన ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరని అడిగితే ఏం చెబుతారు? ఆమె మరెవరో కాదు మలయాళ నటి మమితా బైజు. అవును, ప్రేమలు సినిమాతో మొత్తం దక్షిణాది సినీ అభిమానులను తన వైపు చూసేలా చేసిన నటి మమితా బైజు చిన్ననాటి ఫోటో ఇంటర్నెట్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ చిన్ననాటి ఫోటోలో ఆమెతో పాటు సోదరుడు కూడా ఉన్నాడు. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్‌లో మమిత డా.బైజు కృష్ణన్, మినీ బైజు దంపతులకు జన్మించింది.

Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్

ఆమెకు మిధున్ బైజు అనే అన్నయ్య ఉన్నాడు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది మమిత.. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చి సూపర్ శరణ్య లాంటి సినిమాలు చేసి హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు ప్రేమలు సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే మలయాళంలో పలు సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన రెబల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. దీని తరువాత, రామ్ కుమార్-విష్ణు విశాల్ కలయికలో వస్తున్న సినిమాలో మమిత కథానాయికగా ఎంపికైట్లు సమాచారం. ఇక తెలుగులో ఓ యంగ్ హీరో సినిమాలో మమిత నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కే సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని త్వరలోనే అధికారికంగా ప్రకటించున్నారని టాక్.

Show comments