Manorathangal Trailer Releases: భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన మళయాలం ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త శకానికి నాంది పలికే సరికొత్త వెబ్ సిరీస్ ‘మనోరథంగల్’ను ప్రారంభించారు. M.T. అని ముద్దుగా పిలుచుకునే సాహితీ దిగ్గజం మాదత్ తెక్కెపాట్టు వాసుదేవన్ నాయర్ 90వ పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. అలానే ఈ చిత్రం ఆగస్టు 15న ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. ‘మనోరథంగల్’ వాసుదేవన్ నాయర్ రచించిన తొమ్మిది కథల సంకలనమే ఈ వెబ్ సిరీస్. మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, జరీనా, బిజు మీనన్, కైలాష్, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, సురభి లక్ష్మి, ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ, పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్, మధు, ఆసిఫ్ అలీ వంటి వారు ఈ తొమ్మిది కథల్లో నటించగ వీటికి ప్రియదర్శన్, రంజిత్, శ్యామప్రసాద్, జయరాజన్ నాయర్, సంతోష్ శివన్, రతీష్ అంబట్, అశ్వతి నాయర్ వంటి వారు దర్శకత్వం వహించారు.
Also Read: Bachhala Malli: “మా ఊరి జాతరలో” అని పాట పాడుకుంటున్న అల్లరోడు
ZEE5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ..‘ZEE5లో రానున్న ‘మనోరథంగల్’తో మాలీవుడ్ టాలెంట్ అంతా ఒకే చోటకు రానుంది. ఇది MT వాసుదేవన్ నాయర్‌కు నివాళిలా ఉంది. సాహిత్య దిగ్గజం, సినిమాటిక్ దూరదృష్టి గల అతని 90వ బర్త్ డే సందర్భంగా ఇది జీ5లో రాబోతోన్నందుకు మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా అనిపిస్తోంది. వీక్షకులు తమ స్థానిక భాషలో చూసేందుకు వీలుగా ‘మనోరతంగల్’ని హిందీ, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నామ’ని అన్నారు.దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ.. “కలలు కనడం జీవితంలో ఒక భాగమని, నేను సినిమాలు తీయాలని కలలు కన్నాను. ఎంటీ వాసుదేవన్ నాయర్‌తో సినిమా చేయడంతో నా కల నిజమైంది.ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. ఇది నా 97వ చిత్రం. నేను ఎం.టి. వాసుదేవన్ నాయర్‌తో ఒక చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నించాను. మనోరథంగళ్‌లో రెండు కథలకు డైరెక్షన్ చేశాను. ఈ కలను నిజం చేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు.