చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు ఐటెంసాంగ్స్ చేసేవారు కాదు.. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కావాలనే ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. అంతకు ముందు హీరోయిన్లు ఇలాంటి పాత్రలు మాత్రమే చేయాలనీ ఉండేది.. కానీ ఇప్పుడు ఎలాంటి పత్రాలు అయినా హీరోయిన్లు అవలీలగా చేసేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని, తనను, తన నటనను పరిగణలోకి తీసుకొని ఎంతమంది తన్నాడు టార్చర్ చేశారని బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ వాపోయింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ “20 ఏళ్ల క్రితం ఉన్న చిత్ర పరిశ్రమ కాదు.. ఇప్పుడు చాలా మార్పులొచ్చాయి. గతంలో హీరోయిన్స్ అంటే రెండు రకాల పాత్రలు వచ్చేవి. ఒకటి నీతిగా నిజాయితీగా సతి సావిత్రి లాంటి పాత్రలు.. ఇంకొకటి వేరొకరి భర్తను కోరుకొనే యువతి, క్యారెక్టర్ లెస్ పాత్రలు. కానీ రెండో రకం పాత్రలు చేస్తే వారికి అలాంటి పాత్రలే రాసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు హీరోయిన్స్ అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు.
నేను మర్డర్ లో చేసిన పాత్రనే.. దీపికా పదుకొనే గెహరియా గెహ్రాయియా లో చేసింది. ఆ పాత్రను 15 ఏళ్ళ క్రితమే నేను చేశాను. కానీ అప్పుడు నన్ను క్యారెక్టర్ లెస్ పాత్రలకే సరిపోతావు అని కామెంట్స్ చేశారు. ఇప్పుడు దీపికా చేస్తే కరెక్ట్ అని అంటున్నారు. ఆ సమయంలో నన్ను ఒక నటిగా ఎవరు గుర్తించలేదు. గ్లామర్ ఒలకబోసే యువతిగానే చూశారు. మీడియా టార్చర్ చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన మార్పులకు సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
