Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lurk OTT Release: మలయాళం సినిమాలు అంటేనే విభిన్నమైన కథలు, రియాలిటీ పాత్రలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా సర్వైవల్, ఫారెస్ట్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను కథలోకి లాగేయడంలో ముందుంటాయి. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన మలయాళం థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘లర్క్: ఐస్ ఆన్ ది ప్రే’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు ఐయండిబిలో 8.8 రేటింగ్ ఉండటం, థ్రిల్లర్ ప్రియుల్లో దీనిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
‘సన్ నెక్ట్స్’ (Sun NXT)లో స్ట్రీమింగ్
ఎం.ఏ. నిషాద్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ సోషల్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ‘లుర్క్’ (Lurk: Eyes on the Prey) 2026 జూలై 24న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రన్లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కేవలం నెల రోజుల్లోనే అంటే 2026 ఆగస్ట్ 26 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సన్ నెక్ట్స్’ (Sun NXT)లో డిజిటల్ స్ట్రీమింగ్కు కూడా అందుబాటులోకి వచ్చింది. ఏదో ఒక వింత రూపం అడవిలో నుంచి గమనిస్తోందని, ఏదో ఒక దాని కోసం ఎదురుచూస్తోందనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఈ ప్రకటనను విడుదల చేసింది. దీంతో అసలు ఆ అడవిలో దాగి ఉన్న ప్రమాదం ఏమిటనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇందులో దర్శకుడు నిషాద్ స్వయంగా కథను మలుపు తిప్పే షార్ప్‌షూటర్ జైరామ్ కళ్యాణరామన్ పాత్రను పోషించగా, సాయిజు కురుప్ అటవీ శాఖ మంత్రిగా, మంజు పిళ్లై జిల్లా కలెక్టర్‌గా కీలక పాత్రల్లో నటించారు. వీరితో పాటు అనుమోల్, అజు వర్గీస్, టి.జి. రవి, ప్రశాంత్ అలెగ్జాండర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read
- Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
- Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
- OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
కథ
‘లుర్క్’ కథ కేరళలోని కొండ ప్రాంతాలు, దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకుని ఉండే ఒక గిరిజన గ్రామం చుట్టూ తిరుగుతుంది. అక్కడ అడవి ఏనుగులు, పులుల దాడుల వల్ల గిరిజనులు తమ ప్రాణాలను, పంటలను కోల్పోతూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ప్రభుత్వం, సమాజం వారి సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో, ప్రజలు నిరంతరం భయాందోళనల మధ్యే మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ సమస్య తీవ్రం కావడంతో, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ఫారెస్ట్ మినిస్టర్ (సాయిజు కురుప్), కలెక్టర్ (మంజు పిళ్లై) అటవీ శాఖ అధికారులు (అజు వర్గీస్) రంగంలోకి దిగుతారు. సమస్యను పరిష్కరించడానికి, అడవిలో అలజడి సృష్టిస్తున్న జంతువులను వేటాడటానికి జైరామ్ కళ్యాణరామన్ (M.A. నిషాద్) అనే నిపుణుడైన ప్రొఫెషనల్ షార్ప్‌షూటర్‌ను ఆ గ్రామానికి పిలిపిస్తారు.
షార్ప్‌షూటర్ అడవిలోకి ప్రవేశించిన తర్వాత కథలో అసలైన సస్పెన్స్ మొదలవుతుంది. జంతువుల దాడుల వెనుక మనుషులు చేస్తున్న కొన్ని చట్టవ్యతిరేక పనులు, రాజకీయ మోసాలు, గిరిజన ప్రజలపై జరుగుతున్న దోపిడీ బయటపడతాయి. జంతువుల కంటే స్వార్థపరులైన మనుషులే అత్యంత ప్రమాదకరమైన క్రూర జంతువులుగా మారి అడవిని ఎలా వేటాడుతున్నారనే నిజాన్ని చూపిస్తూ, ఆ అమాయక ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి చేసిన పోరాటంతో కథ ముగుస్తుంది.
తాజావార్తలు
-
ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ.. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా రాని క్లారిటీ..!
-
Electric Shock: విద్యుత్ తీగ తగిలి విద్యార్థిని మృతి, మరో బాలికకు గాయాలు..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
-
PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!