NTV Telugu Site icon

King of Kotha: ఈ ఓనమ్ కి బాక్సాఫీస్ ని కబ్జా చేయనున్న దుల్కర్

Dulquer

Dulquer

తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మోజులో ఉన్నారు. మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేసి మార్కెట్ పెంచుకుంటూ ఉన్నారు. యంగ్ హీరోస్ స్టార్ హీరోస్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సమయంలో కేరళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రం పాన్ ఇండియా లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. సీతా రామం సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వెంకీ అట్లూరితో మరో తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యే లోపే మరో సినిమాతో దుల్కర్ తెలుగు ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ‘కింగ్ ఆఫ్ కోటా’ అనే సినిమాని దుల్కర్ సల్మాన్ చాలా స్పెషల్ గా చేస్తున్నాడు.

అభిలాష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై కేరళ ఫిలిం సర్క్యూట్ లో భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ హెయిర్ పెంచి, రగ్గడ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ లో దుల్కర్ సల్మాన్ చాలా మాస్ గా కనిపించాడు. కురూప్ తర్వాత దుల్కర్ నుంచి వస్తున్న ఆ రేంజ్ కమర్షియల్ సినిమా ఇదే కావడం విశేషం. ఆగస్టు 24న ఓనమ్ ఫెస్టివల్ సందర్భంగా KOK సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే మొదలు పెట్టిన చిత్ర యూనిట్, ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా షూటింగ్ కి ఎండ్ కార్డ్ వేశారు.

Show comments