Site icon NTV Telugu

Mahima Nambiyar : “ఇదే నా లాస్ట్ వార్నింగ్” – యూట్యూబ్ ఛానల్స్‌పై హీరోయిన్ ఫైర్

Mahima Nambiyar

Mahima Nambiyar

గత 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపును సంపాదించిన మలయాళీ బ్యూటీ మహిమా నంబియార్ తాజాగా టాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్నారు. శ్రీవిష్ణుతో కలిసి ఒక కొత్త చిత్రంలో నటిస్తోంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో సమర్పణ కోన వెంకట్ నిర్వహిస్తున్నారు. మహిమా ఇప్పటికే చంద్రముఖి 2, విజయ్ ఆంటోని (రక్తం) వంటి చిత్రాల్లో నటించగా.. మొత్తానికి 50కి పైగా మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు.

Also Read : Shalini Pandey: ఆశలన్నీ ధనుష్‌పై పెట్టుకున్న షాలిని పాండే..

అయితే ఇటివల కథ డిమాండ్‌ చేస్తే తప్ప గ్లామర్ పాత్రలు చేయడానికి మహిమా ఎప్పుడూ తగ్గరని వార్త వైరల్ అయవ్వడంతో.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్‌లు చేశారు. ఈ ట్రోల్లింగ్ ఆమెకు కోపాన్ని రేకెత్తించింది. తద్వారా మహిమా నంబియార్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టమైన హెచ్చరించింది.. ‘కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిజ నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నాయి. ఇకపై సహించేది లేదు చట్టపరమైన చర్చలు తీసుకుంటా. ఇంత కాలం నా గురించి ఎన్ని పుకార్లు పుట్టించిన సైలెంట్ గానే ఉన్న కానీ, ఇకపై అలా ఉండను, నేను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదని, అదే విధంగా నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు ఎందుకు. ఒక వేళ ఎవరైనా హద్దులు దాటి నాపై అబద్దపు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్చలు తీసుకుంటా, ఇదే నా చివరి హెచ్చరిక’ అంటూ నటి మహిమా నంబియార్‌ పేర్కొన్నారు.

Exit mobile version