NTV Telugu Site icon

Subi Suresh: ప్రముఖ యాంకర్ కమ్ నటి మృతి

Kiran

Kiran

Subi Suresh: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు ప్రేక్షకులను బెంబేలెత్తిస్తున్నాయి గత నాలుగు నెలలుగా వరుసగా సినీ ప్రముఖులు మరణ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నెలలోనే నలుగురు ప్రముఖులు మృతి చెందారు. ఇక తాజాగా ప్రముఖ మలయాళ నటి సుభి సురేష్ కన్నుమూసింది. మలయాళంలో యాంకర్ కమ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుభి గత కొంత కాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఇక ఈ వ్యాధి ఎక్కువ అవ్వడంతో ఇటీవలే కేరళలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరింది. అయితే ఆమె శరీరం.. చికిత్సకు స్పందించకపోవడంతో వ్యాధి ఎక్కువ అయ్యి బుధవారం హాస్పిటల్ లోనే మృతి చెందింది.

సుభి సురేష్ వయస్సు 34. అతి చిన్న వయస్సులోనే ఆమె మృతి చెందడంతో మలయాళ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఇక సుభి సురేష్ మలయాళంలో మంచి యాంకర్.. అంటే కాకుండా మంచి సీరియల్ నటి. గృహనాధన్, తస్కర లహల సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. పలు సినిమాల్లో కూడా ఆమె నటించింది. ఇక సుభి మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో హీరోయిన్లు అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఆ వ్యాధుల వలన ఇలా మరణిస్తున్నారు. ఆహార అలవాట్లు, వర్క్ అవుట్స్, అందం కోసం సర్జరీల వలన ఇలాంటి వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show comments