మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఉడుంబు’ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల్ని గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. గతంలో శ్రీధర్ ‘చిత్రాంగద’, ‘ఇదం జగత్’, ‘మంత్ర’, ‘మంగళ’ చిత్రాలతో పాటు ‘కుమారి 21 ఎఫ్’ మూవీని కన్నడలో రీమేక్ చేశారు. ప్రస్తుతం రమ్యకృష్ణతో కన్నడలో ‘శివగామి’ చిత్రం నిర్మిస్తున్నారు. మలయాళంలో కె.టి. తమరక్కుళం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఉడుంబు’ సినిమా రీమేక్ హక్కుల కోసం పలువురు పోటీ పడినా శ్రీధర్ వాటిని పొందడం విశేషం. ఈ సినిమాను త్వరలోనే శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై తెలుగులో పునర్ నిర్మిస్తామని, దీని ద్వారా రత్నాకరం అనిల్ రాజును దర్శకుడిగా పరిచయం చేయబోతున్నామని శ్రీధర్ చెప్పారు.
Read Also : Venkatesh : రెండు భారీ డిజాస్టర్ల నుంచి తప్పించుకున్న వెంకీ మామ !!
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని అన్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన పలు మలయాళ చిత్రాలు తెలుగులోనూ ఘన విజయం సాధిస్తున్నాయని, అలానే పలు రీమేక్ చిత్రాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయని శ్రీధర్ చెబుతూ, ‘మలయాళ చిత్రం ‘ఉడుంబు’ను హిందీలో జాన్ అబ్రహం రీమేక్ చేస్తున్నారని, తమిళంలోనూ ఓ సీనియర్ హీరోయిన్ తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రీమేక్ చేస్తున్నార’ని తెలిపారు.
