NTV Telugu Site icon

Malavika Nair: ఆ ‘జాతిరత్నం’ ను ఉంచుకుంటా అంటున్న హీరోయిన్

Malavika

Malavika

Malavika Nair: ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ మాళవిక నాయర్. మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించిన ఈ చిన్నది వరుస అవకాశాలను అయితే అందుకోగలిగింది కానీ, ఎందుకో విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఆ విజయం కోసం అమ్మడు పోరాడుతూనే ఉంది. ఇక తాజాగా అన్ని మంచి శకునములే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కుర్ర హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్నీ మంచి శకునములే. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక చిన్న సీక్రెట్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా కోసం జాతిరత్నం డైరెక్టర్ అనుదీప్ కెవి కూడా కష్టపడినట్లు తెలుస్తోంది.

Ugram Movie Review: ఉగ్రం

కొన్ని డైలాగ్స్.. అనుదీప్ రాసినట్లు టాక్ నడుస్తోంది. ఇక తాజాగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక నాయర్, అనుదీప్ మధ్య జరిగిన చిన్న సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. ఇద్దరు మెట్లు దిగుతుండగా.. మాళవిక.. అనుదీప్ నీకో విషయం చెప్పాలి.. ఏమి అనుకోవద్దు మరీ అని అడిగింది.. అందుకు అనుదీప్.. చెప్పండి అనగానే.. మాళవిక.. నిన్ను ఉంచుకుంటా అబ్బాయ్ అని షాక్ ఇచ్చింది. అందుకు అనుదీప్ చేతుల్లో ముఖం దాచుకుని సిగ్గు పడుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీనికి క్యాప్షన్ గా ” అలా అనుదీప్ గారిని ఉంచుకోవడం జరిగింది” అని చెప్పింది. అంటే సినిమాలో అనుదీప్ కూడా అలా చేయి వేశాడు అన్నమాట. మరి ఈ సినిమాతోనైనా మాళవిక ఫేట్ మారుతుందేమో చూడాలి.

Show comments