Malavika Mohanan: మాస్టర్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ సినిమాలో అమ్మడు కనిపించింది కొద్దిసేపే కానీ మంచి గుర్తింపునే అందుకొంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయిన ఈ బ్యూటీ అందాల ఆరబోతకు హద్దే లేదని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారికి ఈ విషయం బాగా అర్ధమవుతోంది. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నోరు జారీ అడ్డంగా బుక్కయ్యింది. యాంకర్ అడిగిన ప్రశ్న కాకుండా ఆమె ఏదో అనుకోని చెప్పిన సమాధానం షాకింగ్ కు గురిచేస్తోంది.
ఒక ఇంటర్వ్యూలో యాంకర్.. ” మీకు బియర్డ్(గడ్డం) ఉన్న ఏ హీరో హాట్ రణ్వీర్ సింగ్ లేదా విక్కీ కౌశల్” అని అడిగాడు. కానీ మాళవికకు మాత్రం బెడ్ పై ఏ హీరో హాట్ అని అడిగినట్లు వినిపించి.. బెడ్ పై ఏ హీరో హాట్ అంటే అని నోరు జారింది. దానికి షాక్ అయిన యాంకర్.. తాను అడిగిన ప్రశ్న అదికాదని చెప్పగానే వెంటనే నాలుక్కర్చుకొని నాకు బియర్డ్, బెడ్ లా వినిపించింది అని నవ్వేసింది. అసలు అలాంటి ఒక ప్రశ్న అడిగితే ఆమె సమాధానం చెప్పడానికి రెడీ అయ్యింది అంటేనే ఆశ్చర్యం.. ఇదే ప్రశ్న వేరే ఏ హీరోయిన్ ను అడిగినా కోపంతో ఊగిపోతారు అని కొందరు చెప్తుండగా.. మాళవిక మహా రొమాంటిక్ అని.. అందుకే బెడ్ అంటూ వినిపించిందంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
