Site icon NTV Telugu

Malaika Arora: మలైకా-అర్జున్ కపూర్ బ్రేకప్ నిజమే.. ఇవిగోండి ప్రూఫ్స్!

Malaika Arjun

Malaika Arjun

Malaika Arora unfollows Kapoor Family in Instagram: నిజానికి వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో పడి అందరికీ షాక్ ఇచ్చిన అర్జున్ కపూర్ -మలైకా అరోరా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో సరికొత్త ప్రచారం జరుగుటఁది. ఆ దెబ్బకు సోషల్ మీడియాలో సైతం వీరిద్దరి బ్రేకప్ గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. అయితే దీనిపై ఇద్దరూ అధికారికంగా ఏమీ మాట్లాడలేదు కానీ మలైకా తన సోషల్ మీడియాలో చేసిన కొన్ని పనులు ఇప్పుడు వీరి బ్రేకప్ నిజమేనేమో అనేలా చేస్తునున్నాయి. ఒకరకంగా ఆమె చేసిన పని ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది. మలైకా – అర్జున్ కపూర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీకేషన్స్ మొదలు చాలా ఈవెంట్‌ల వరకు ఇద్దరూ కలిసి వెళ్తూ మీడియా కంటికి కనిపించేవారు. ముందు జనం కొంత వీరి బంధం గురించి కామెంట్ చేసినా ఇప్పుడు ఆరు కూడా అలవాటు పడ్డారు. ఐదు సంవత్సరాలకు పైగా వీరి బంధం ఉండడంతో త్వరలో పెళ్లి కూడా జరగనుందనే వార్త సైతం తెరపైకి వచ్చింది.

Venky Re Release: గజాలా గెట్ రెడీ.. వెంకీ మళ్లీ వస్తున్నాడు!

అర్జున్, మలైకా పెళ్లి కూడా జరుగుతుందని అందరూ భావిస్తున్న ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఏదీ సరిగా లేదనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ కుటుంబాన్ని అన్‌ఫాలో చేసింది. బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం, మలైకా అర్జున్ కపూర్ సోదరీమణులు జాన్వి కపూర్, ఖుషీ కపూర్‌లను ముందు వరకు ఇన్‌స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండే మలైకా ఇప్పుడు అన్‌ఫాలో చేసింది. అంతేకాదు అన్షులా కపూర్, బోనీ కపూర్ లను కూడా ఆమె అన్ ఫాలో అయింది. అయితే ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే అర్జున్ కపూర్ ఫ్యామిలీ మొత్తాన్ని అన్ ఫాలో చేసినా ఇప్పటికీ, అర్జున్ కపూర్‌ను ఫాలో ఆవుతోన్నది. ఇక ఇటీవల, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కుషా కపిల అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇక తన ఎఫైర్ వార్తలపై ఆమె మౌనం వీడుతూ “ నా గురించి చాలా అర్ధంలేని విషయాలు చదివిన తర్వాత, నన్ను నేను అధికారికంగా పరిచయం చేసుకోవాలి, నా గురించి ఎప్పుడూ లేనిపోని మాటలు వింటూనే ఉంటాను, కేవలం మా అమ్మ ఇవన్నీ చదవకూడదు అని ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version