God Father: మెగాస్టార్ చిరంజీవి- మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్. కొణిదెల ప్రొడక్షన్స్ సురేఖ సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్బి చౌదరి మరియు ఎన్వి ప్రసాద్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయన్ తార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే గత కొన్నిరోజులుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఇంకా జరుపుకుంటూనే ఉందని, రీ రికార్డింగ్ పనులు ఇంకా మోడల్ పెట్టలేదని చెప్పుకొస్తున్నారు. దీనివలన జాప్యం జరుగడంతో రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ వార్తలపై స్పందించారు మేకర్స్. ఇలాంటి రూమర్స్ నమ్మవద్దని, సినిమా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుందని నిర్మాత ఎన్వి ప్రసాద్ కక్లారిటీ ఇచ్చాడు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని, త్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది. ఆచార్య ప్లాప్ తో నిరాశలో ఉన్న చిరుకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
