Site icon NTV Telugu

Mithra Mandali : మిత్ర మండలి రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

Mitra Mandali

Mitra Mandali

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రం హాస్యం, రహస్యం, యవ్వన శక్తి మిశ్రమంగా ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరు వెండితెరపై నవ్వుల టపాసులు పేల్చబోతున్నారు. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్స వ్యవహరిస్తున్నారు.

Also Read : Tollywood : ఇప్పటికైనా ఆ హీరోయిన్ ను టాలీవుడ్ దర్శకులు గుర్తిస్తారా

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇక  ఈ సినిమా రిలీజ్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రేక్షకులు థియేటర్లలో నవ్వులతో నిండిన దీపావళి పండుగను చేసుకునేలా ‘మిత్ర మండలి’ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టీజర్‌తో ఆసక్తిని రేకెత్తించి, రెండు చార్ట్‌బస్టర్ పాటలతో అభిమానులను అలరించిన తర్వాత, నిర్మాతలు ఇప్పుడు ఆకట్టుకునే విడుదల తేదీ పోస్టర్‌తో పాటు ఒక వినోదభరితమైన ప్రకటన వీడియోను రిలీజ్ చేసారు. బాణసంచా కాల్చడం మరియు గ్యాంగ్ యొక్క ఉత్సాహభరితమైన శక్తితో నిండిన ఈ పోస్టర్ పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది. ఇక ప్రకటన వీడియో అయితే నవ్వులు పూయిస్తూ సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

Exit mobile version