Mailurai : టాలీవుడ్’కి మరో లేడీ నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు లేడీ బాస్‌ల హవా నడుస్తోంది. మహిళా నిర్మాతల జాబితాలోకి మరో యువ నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ ఈవెంట్లో మెగా బ్రదర్ నాగబాబు చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేసిన సీనియర్ నటుడు, ఏపీ శాసనమండలి సభ్యుడు నాగబాబు.. కొత్త నిర్మాత హన్సికను ఏకంగా టాలీవుడ్ టాప్ లేడీ ప్రొడ్యూసర్లతో పోల్చడం అందరి దృష్టిని ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ వైపు తిప్పేలా చేసింది. “సినిమా మేకింగ్‌లో మహిళలకు ఉండే బాధ్యత, క్రమశిక్షణ చాలా గొప్పవి. ఇప్పటికే స్వప్న దత్, ప్రియాంక దత్, మా అమ్మాయి నిహారిక, సుప్రియ లాంటి వాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. హన్సిక కూడా అదే బాటలో పయనిస్తూ ఇండస్ట్రీలో భారీ విజయాలు సాధించాలి” అని ఆయన మనస్ఫూర్తిగా దీవించారు. ఒక డెబ్యూ ప్రొడ్యూసర్‌కు మెగా కాంపౌండ్ నుంచి ఈ రేంజ్ సపోర్ట్ అండ్ అప్రిసియేషన్ దక్కడం మామూలు విషయం కాదు.
ఇక సినిమా విషయానికొస్తే.. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎక్కడా హడావుడి లేకుండా సైలెంట్‌గా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ పక్కా లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా.. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని సహ నిర్మాత తవిటిరాజు తలచింతల వెల్లడించారు. సీనియర్ నటుడు దేవీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ రాజ్ సంగీతం, సాయి వంశీ దాచపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే అదిరిపోయే టీజర్, పాటలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు హీరో జగన్ యోగిరాజు, డైరెక్టర్ రఘువర్ధన్ ఉత్సాహంగా తెలిపారు. టాప్ లేడీ ప్రొడ్యూసర్ల స్ఫూర్తితో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన హన్సికకు.. ఈ ‘మైలురాయి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ మైల్ స్టోన్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
Also Read
తాజావార్తలు
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!