NTV Telugu Site icon

Mahie Gill: సీక్రెట్ మ్యారేజ్ పై పెదవి విప్పిన బాలీవుడ్ బ్యూటీ!

Mahie

Mahie

Ramcharan: రెండు దశాబ్దాలుగా హిందీ, పంజాబీ చిత్రాలతో అలరిస్తోంది మహీ గిల్. ఇంతవరకూ పెళ్ళి విషయమై పెదవి విప్పని మహీ తనకో రెండేళ్ళ పాప ఉందనే విషయాన్ని 2019లోనే చెప్పింది. అయితే… ఎంటర్ పెన్యూర్, యాక్టర్ రవి కేశర్ తో ఆమె లివ్ ఇన్ రిలేషన్ లో ఉందనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకూ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించని ఈ 47 పంజాబీ భామ ఇప్పుడు హఠాత్తుగా తామిద్దరికీ గతంలోనే పెళ్ళి అయిపోయిందనే విషయాన్ని స్పష్టం చేసింది. రవితో కలిసి 2019లో మహీ గిల్ ‘ఫిక్సర్’ అనే వెబ్ సీరిస్ లో నటించింది. నిజానికి అప్పటికే ఆమెకు కూతురు ఉంది. ఇప్పుడు కూడా రవిని ఎప్పుడు పెళ్ళి చేసుకుందనే విషయాన్ని మాత్రం మహీ గిల్ తెలియపర్చలేదు. అత్యంత సన్నిహితుల సమక్షంలో తమ వివాహం జరిగిందని మాత్రం చెప్పింది.

ప్రస్తుతం కూతురు విరోనికా, రవి కేసర్ తో కలిసి మహీ గిల్ గోవాలో నివాసం ఉంటోంది. “దేవ్ డి’, నాట్ ఎ లవ్ స్టోరీ, సాహెబ్ బీవీ అవుర్ గ్యాంగ్ స్టర్, పాన్ సింగ్ తోమర్” తదితర చిత్రాలతో పాటు రామ్ చరణ్ ఏకైక హిందీ చిత్రం ‘జంజీర్’లోనూ మహి గిల్ నటించింది. ఇది తెలుగులో ‘తుఫాన్’ పేరుతో వచ్చింది. గతంతో తన కుమార్తె వెరోనికా గురించి చెబుతూ, “నేను ఓ పాపకు తల్లినని చెప్పుకోవడానికి గర్వపడతాను. బట్ నాకు ఇంతవరకూ పెళ్ళి కాలేదు. నేను ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలనుకుంటే అప్పుడే చేసుకుంటాను” అని తెలిపింది. మొత్తానికి ఆ ముచ్చటేదో తీరిపోయిందని ఇప్పటికైనా ప్రపంచానికి మహీ గిల్ చెప్పడం విశేషం!!

Show comments