NTV Telugu Site icon

Yatra 2: ఎలక్షన్స్ టార్గెట్ గా ‘యాత్ర 2’

Yatra 2

Yatra 2

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకుడు “వైఎస్ రాజశేఖర్ రెడ్డి” జీవితం ఆధారంగా డైరెక్టర్ మహి.వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ‘వైఎస్ఆర్సీపీ’ కార్యకర్తలని మాత్రమే కాకుండా సినీ అభిమానులందరినీ మెప్పించింది. 2019లో రిలీజ్ అయిన యాత్ర మూవీ గత ఎన్నికల్లో జగన్ కి, వైఎస్ఆర్ పార్టీకి బాగా కలిసొచ్చింది. “నేను విన్నాను, నేను ఉన్నాను” అనే డైలాగ్ ని ముఖ్యమంత్రి జగన్ బాగా వాడారు. ఇప్పుడు 2024 ఎన్నికలని టార్గెట్ చేస్తూ ‘యాత్ర 2′ సినిమాని రెడీ చేస్తున్నాడు డైరెక్టర్ మహి రాఘవ్. ఫిబ్రవరి 2024 యాత్ర 2 రిలీజ్ అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. జగన్ ముఖ్యమంత్రి అవ్వకముందు, ఆయన పాదయాత్ర, నవరత్నాలు ఎలా మొదలయ్యాయి అనే విషయాలని యాత్ర 2 సినిమాలో చూపించనున్నారు.

“నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి… నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అనే డైలాగ్ ని పోస్టర్ లో పెట్టిన మేకర్స్, యాత్ర 2 సినిమా ఓదార్పు యాత్ర నుంచి మొదలై జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణశ్వీకారం చేసే వరకు ఉంటుందని హింట్ ఇచ్చారు. యాత్ర 2 సినిమాని యువీ సెల్ల్యులాయిడ్స్, త్రీ ఆటుమైన లీఫ్స్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ సంతోష్ నారాయణ్ యాత్ర 2 సినిమాకి మ్యూజిక్ ఇస్తుండగా, మధి సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ తో వైఎస్ఆర్సీపీ’ కార్యకర్తల్లో జోష్ నిండింది. మరి ఇందులో మమ్ముట్టి కూడా ఉంటాడా? లేక ఆయన తదనంతరం నుంచి ఈ సినిమా మొదలవుతుందా? జగన్ గా నటించే హీరో ఎవరు? అనేది తెలియాల్సి ఉంది.

Show comments