Site icon NTV Telugu

Mahi V Raghav: ఆ రాళ్లు ఎత్తే ఓపిక లేదు.. బురద తుడుచుకునే ఓపిక లేదు..

Yatra 2

Yatra 2

Mahi V Raghav: ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా యాత్ర. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం యాత్ర 2. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు. 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా యాత్ర 2 చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం సమాధానాలు చెప్పుకొచ్చింది. ఇక ఈ మీట్ లో మహి వి రాఘవ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. సినిమా గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.. ట్రోల్ చేస్తున్నారు .. దానికి మీ సమాధానం ఏంటి అన్న ప్రశ్నకు మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. ” రాజకీయం గానీ రాజకీయ నాయకుల గురించి గానీ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు చేసినప్పుడు గాని రాళ్లు వేసే వాళ్ళు రాళ్లు వేస్తారు. బురద వేసే జల్లేవాళ్ళు జల్లుతారు. ఇప్పుడు నాకు ఆ రాళ్లు ఎత్తే ఓపిక లేదు, బురద తుడుచుకునే ఓపిక లేదు.. అది నా జాబ్ కాదు. సోషల్ మీడియాలో వంద వస్తాయి. పని లేనివాడు వాటిని చదివి సమాధానాలు ఇస్తాడు.. మిగతవాళ్ళు వదిలేస్తారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version