Site icon NTV Telugu

Mahesh Babu: కూతురితో కలిసి ఆ షోకు మహేష్ బాబు.. పూనకాలే

Sitara

Sitara

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈవెంట్స్ కు రావడం చాలా అరుదు. అయితే సినిమాలు లేకపోతే ఫ్యామిలీ ఏవి తప్ప మహేష్ కు వేరే ప్రపంచం లేదని అందరికి తెల్సిందే. మరి ముఖ్యంగా మహేష్ బుల్లితెర షోలకు రావడం అంటే విశేషమనే చెప్పాలి. అవార్డులు ఇవ్వడానికో, అవార్డు తీసుకోవడానికో తప్ప కనిపించడు. ఇక మహేష్ గారాలపట్టి సితార అయితే ఇప్పటివరకు సినిమా ఫంక్షన్స్ కు కూడా వచ్చి ఎరగదు. అయితే తాజాగా ఈ తండ్రి కూతుళ్లు అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. బుల్లితెరపై జరిగే ఒక షోకు సితారతో కలిసి మహేష్ బాబు గెస్ట్ గా రానున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ఒక ప్రముఖ ఛానెల్ లో ప్రారంభం కాబోతున్న డాన్స్ షోకు మహేష్ హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే జరుగగా.. సెట్ లో నుంచి మహేష్ ఎంట్రీ ఫోటో లీక్ అయ్యింది. అది కాస్తా వైరల్ గా మారింది. సితార తళుకులీనుతున్న డ్రెస్ లో ఉండగా మహేష్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక డాన్స్ షో తో పాటు గేమ్ షో అని కూడా తెలుస్తోంది. మహేష్ వస్తే తమ టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్ లో ఉంటుందని భావించిన యాజమాన్యం మహేష్ ను కన్విన్స్ చేసి ఈ షోకు రప్పించిందని టాక్ నడుస్తోంది. మరి ఈ షో లో మహేష్ ఏమైనా కూతురితో కలిసి చిందేసాడా..? ఏదైనా మాట్లాడతాడా..? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ షో ఎప్పుడు మొదలుకానుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.

Exit mobile version