Site icon NTV Telugu

Mahesh Bhatt : సినిమా కోసం ప్రోడ్యూసర్‌కు మంత్రించిన మాంసం తినిపించిన ఫిలింమేకర్

Mahesh Bhat

Mahesh Bhat

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మ‌హేశ్ భట్ తన ఫీల్డ్ లో ప్రారంభ దశల్లో ఎదురైన షాకింగ్ అనుభవాన్ని పూజా భట్‌తో చేసిన పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. తన మొదటి సినిమాకు పెట్టుబడిదారులను కనుగొనడం చాలా కష్టం అని, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే సినిమా చేయలేనని ఆయన తెలిపారు. ఈ సమస్య పరిష్కరించడానికి, వారణాసిలోని ఒక మాంత్రికుడిని కలిసారు.

Also Read: Evergreen Club 80 : 80’S రీ యూనియన్.. తళుక్కుమన్న స్టార్స్ ను చూశారా..

అత‌డు మంత్రించిన మాంసం ముద్దను తీసి దానినుంచి ఒక ముక్కను నిర్మాత‌కు ఇచ్చాడు. దానిని అత‌డు క‌ల‌వాల‌నుకుంటున్న ఫైనాన్షియ‌ర్ కి ఏదో ఒక రూపంలో తినిపించమ‌ని చెప్పాడు. త‌న స్నేహితుడితో క‌లిసి నిర్మాత‌ ఆ ప్రయ‌త్నం చేసాడు. వారు ఒక కిళ్లీలో మాంసం ముక్కను క‌లిపారు. దానిని తినాల్సిందిగా ఫైనాన్షియ‌ర్ వెంట‌ప‌డ్డారు. జ‌మీందార్ లాంటి అత‌డు దానిని సున్నితంగా తిర‌స్కరించాడు. అయినా అత‌డిని వ‌ద‌ల‌కుండా చివ‌ర‌కు ఒప్పించారు. అత‌డు ఆ కిళ్లీని న‌మ‌ల‌డం ప్రారంభించాక స్కైలో తేలిన ఫీలింగ్ క‌లిగింద‌ట స‌ద‌రు నిర్మాత‌కు. ఇక త‌న సినిమాకి అవ‌స‌ర‌మైన పెట్టుబడి దొరికిన‌ట్టేన‌ని భావించాడు. కానీ ఆ మాంత్రికుడు చెప్పిన‌ట్టు ఏదీ జ‌ర‌గ‌లేదు. ఫైనాన్షియ‌ర్ ఆ సినిమాకు పెట్టుబ‌డి సాయం చేయ‌లేదట. ఈ మాటలు విన్న ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇలాంటి కూడా ఉంటాయా అనే చర్చలు మోదలయ్యాయి.

Exit mobile version