NTV Telugu Site icon

Okkadu: ఘట్టమనేని అభిమానులు మాస్ జాతరకి రెడీ అవ్వండి

Okkadu

Okkadu

సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ కి దగ్గర చేసిన మొదటి సినిమా ‘ఒక్కడు’. ‘టక్కరి దొంగ’, ‘బాబీ’ లాంటి ఫ్లాప్ అవ్వడంతో మహేశ్ బాబు, కృష్ణ లెగసీని క్యారీ చెయ్యలేకపోతున్నాడు అనే కామెంట్ వినిపించడం మొదలయ్యింది. ఈ కామెంట్స్ ని పర్మనెంట్ గా సమాధి చేసిన సినిమానే ‘ఒక్కడు’. స్పోర్ట్స్ ని, ఫ్యాక్షన్ డ్రామాని మిక్స్ చేసి ‘ఒక్కడు’ సినిమాని గుణశేఖర్ ఒక మాస్టర్ పీస్ లా తెరకెక్కించాడు. హీరో, విలన్ ట్రాక్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ ‘ఒక్కడు’ సినిమాలో కనిపిస్తాయి.

అర్జున్, ఓబుల్ రెడ్డిల మధ్య సీన్స్ ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. బ్యూటిఫుల్ రైటింగ్, బెస్ట్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ తో పాటు ‘ఒక్కడు’ మూవీకి మరో ప్రధాన బలం ‘మణిశర్మ’ సంగీతం. పాటల నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకూ ప్రతి విషయంలో మణిశర్మ మ్యాజిక్ ‘ఒక్కడు’ సినిమాలో కనిపిస్తుంది. మహేశ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించిన ఈ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొండారెడ్డి బుర్జు దగ్గర ఓబుల్ రెడ్డిని కొట్టి మహేశ్ బాబుని నిలబడితే థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇంత హై ఇచ్చిన కమర్షియల్ సినిమా అప్పట్లో మరొకటి లేదు. ‘ఒక్కడు’ మూవీ 2003 జనవరి 15న రిలీజ్ అయ్యింది, వచ్చే జనవరికి ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అవుతుండడంతో ‘ఒక్కడు’ రీరిలీజ్ కి రంగం సిద్ధమవుతోంది. జనవరి 7న ‘ఒక్కడు’ స్పెషల్ షోస్ వేస్తున్నట్లు నిర్మాత ‘ఎమ్మెస్ రాజు అఫీషియల్ గా ప్రకటించాడు.

అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి థియేటర్స్ దగ్గర అభిమానులు చేసే హంగామా ఎలా ఉంటుందో ఎక్కువమందికి తెలియదు. ఇప్పుడు అలా కాదు థియేటర్స్ దగ్గర ఫ్యాన్ ఏ రేంజులో హంగామా చేస్తారో ‘పోకిరి’ స్పెషల్ షో ఇప్పటికే నిరూపించాయి. మరోసారి అలాంటి మాస్ హిస్టీరియానే ‘ఒక్కడు’ స్పెషల్ షోస్ తో రీక్రియేట్ చెయ్యబోతున్నారు ఘట్టమనేని అభిమానులు. ‘ఒక్కడు’ సినిమాకి వారం రోజుల ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా రీరిలీజ్ అవ్వనుంది. మహేశ్, పవన్ కళ్యాణ్ కెరీర్ లో 7వ సినిమాలుగా రూపొందిన ‘ఒక్కడు’, ‘ఖుషి’ సినిమాల్లో హీరోయిన్ భూమికనే కావడం విశేషం.

Show comments