Site icon NTV Telugu

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న “సర్కారు వారి పాట”

Mahesh Babu wraps Sarkaru Vaari Pata Goa schedule

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్‌టైనర్ “సర్కారు వారి పాట” సినిమా గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసారు. ఈ హీరో తన కుటుంబం, సోదరి మంజుల, స్నేహితురాలు, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి ఈ రోజు ఉదయం చార్టర్డ్ విమానంలో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. 2 వారాల పాటు జరిగిన సుదీర్ఘ షెడ్యూల్‌లో దర్శకుడు పరశురామ్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, మహేష్, కీర్తిలతో పాటు ఇతర ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో జరుగుతుంది.

Read Also : మిస్టర్ బైడెన్… చెప్పు తెగుద్ది ఎదవ : నిఖిల్

యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” పేరుతో విడుదలైన ఈ బ్లాస్టర్ కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్ వచ్చాయి.

Exit mobile version