Site icon NTV Telugu

Narendra Modi : ప్రధాని‌కి.. మహేశ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు – స్పెషల్ వీడియో

Mahesh Babu Pradani Modi

Mahesh Babu Pradani Modi

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేక వీడియో ద్వారా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. “మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే, మీరు చూపిస్తున్న నాయకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ఇస్తుంది. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు దేశం అభివృద్ధికి దోహదపడుతున్నాయి” అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్లలో చర్చనీయాంశమైంది.  సినిమాల ద్వారా తన అభిమానులను మాత్రమే కాకుండా, సామాజిక, రాజకీయ స్థాయిలోనూ ప్రభావాన్ని చూపగల హీరో.. అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. వారు కూడా మహేశ్ బాబు ఈ పద్ధతిలో ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు అభినందించారు.

 

Exit mobile version