Site icon NTV Telugu

Hi Nanna: న్యాచురల్ స్టార్ ‘నాని’ సినిమా సాంగ్ కి సూపర్ స్టార్ ‘నాని’ సపోర్ట్…

Hi Nanna

Hi Nanna

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. యంగ్ డెబ్యూ డైరెక్టర్ శౌరవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా లాంటి మాస్ సినిమా తర్వాత ప్యూర్ ఫ్యామిలీ లవ్ ఎమోషన్స్ తో సినిమా చేస్తున్నాడు అంటేనే నాని ‘హాయ్ నాన్న’ కథని ఎంత నమ్మాడో అర్ధమవుతుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. జెర్సీ, నిన్ను కోరి సినిమాల్లో ఉన్న ఫీల్ ని హాయ్ నాన్న క్యారీ చేస్తుంది. సమయమా సాంగ్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ని మర్చిపోక ముందే హాయ్ నాన్న నుంచి గాజు బొమ్మ అనే సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయ్యింది. తండ్రి కూతురి మధ్య ఉన్న బంధాన్ని గాజు బొమ్మ సాంగ్ లో చాలా బాగా చెప్పారు, అందుకే కూతురు ఉన్న ప్రతి తండ్రి ఈ సాంగ్ ని ఇష్టపడుతున్నాడు.

మల్టీ లాంగ్వేజస్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ ని తమిళ్ లో శివ కార్తికేయన్, కన్నడలో సుదీప్ లాంచ్ చేయగా… తెలుగులో మహేష్ బాబు గాజు బొమ్మ సాంగ్ కి సపోర్ట్ చేసాడు. ఈ సాంగ్ ని ట్వీట్ చేస్తూ మహేష్ బాబు… “ఒక తండ్రి నుంచి తన కూతురికి” అంటూ పోస్ట్ చేసాడు. సితార ఘట్టమనేని, మహేష్ బాబు ఉన్న హాయ్ నాన్న పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ చేసిన ట్వీట్ కి నాని థాంక్స్ చెప్తూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం గాజు బొమ్మ సాంగ్ అన్ని ప్లాట్ ఫార్మ్స్ లో ట్రెండ్ అవుతోంది. సమయమా సాంగ్ తో లవ్ స్టోరీ సినిమా అనిపించిన హాయ్ నాన్న మూవీ ఫీల్ ని గాజు బొమ్మ సాంగ్ పూర్తిగా మార్చేసింది. మరి మాస్ సినిమా తర్వాత ఫీల్ గుడ్ మూవీతో ఆడియన్స్ ముందుకి వస్తున్న నాని ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Exit mobile version