NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కి ఊహించని గెస్ట్.. ప్లానింగ్ వేరే లెవల్ అంతే!

Bigg Boss7

Bigg Boss7

Mahesh Babu to attend Finale of Bigg Boss Telugu 7: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ రియాలిటీ షో కూడా ఒకటి. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ పేరుతో ఏడవ సీజన్ కూడా పూర్తి చేసుకోబోతోంది. ఇప్పటికే అనేక వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం చివరి వారానికి వచ్చేసింది. మరి కొద్ది రోజులలో ఈ కార్యక్రమం పూర్తి కానున్న నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 17వ తేదీ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారని టాక్. ఇప్పటివరకు ఈ విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్త అయితే దాదాపు అధికారికమే. ఇక డిసెంబర్ 17వ తేదీ ఫినాలేలో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వేదికపై సందడి చేయబోతున్నారు, మొత్తం 19 మంది కంటెస్టెంట్లు గ్రాండ్ ఫినాలేలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Pooja Hegde: పూజా హెగ్డేకి షాక్.. చంపేస్తామని బెదిరింపులు?

గ్రాండ్ ఫినాలేలో ప్రతిసారి ఎవరో ఒక స్టార్ హీరో వేదిక పైకి వచ్చి విన్నర్ ని ప్రకటించే ట్రోఫీ అందజేస్తూ ఉంటారు. గత కొద్దీ సీజన్స్ నుంచి చిరంజీవి ఇలా వచ్చి ట్రోఫీ ఇచ్చి వెళుతున్నారు. ఇక ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేలో ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కాబోతున్నారని టాక్. మహేష్ బాబు ఈ ఫినాలే కార్యక్రమంలో పాల్గొని విజేతను ప్రకటించి ట్రోఫీ అందజేయబోతున్నారని తెలుస్తోంది, ఇక ఇంతలోనే పనిలో పనిగా తన గుంటూరు కారం సినిమా ప్రమోషన్లను కూడా నిర్వహించినట్లు ఉంటుందన్న ఉద్దేశంతోనే మహేష్ బాబు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా రాబోతున్నాడని టాక్. ఇక ఆయన నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Show comments